Modi Cabinet Expansion 2021: కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు

Modi Cabinet Expansion 2021: ఈ నెల 8న ఉ.10:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ

Update: 2021-07-06 09:41 GMT

కేంద్ర కాబినెట్ విస్తరణ (ఫైల్ ఇమేజ్)

Modi Cabinet Expansion 2021: కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఉదయం పదిన్నర గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన ప్రధాని మోడీ.. కేబినెట్‌లో కొత్తగా 20 మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరు ఇన్‌.. ఎవరు అవుట్‌ అనే అంశం ఉత్కంఠకు తెర లేపింది. మరోవైపు.. త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉంది. అయితే.. ప్రస్తుతం 53 మందితోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. మిగిలిన 28 స్థానాలను భర్తీ చేసే పనిలో పడింది కేంద్రం. ఇంకోపక్క.. కేబినెట్‌ విస్తరణ నేపథ్యంలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే కొందరికి ఢిల్లీ నుంచి ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాతో పాటు.. అసోం మాజీ సీఎం శ‌ర్బానంద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణేల పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం అందుతోంది.

Full View


Tags:    

Similar News