Maoist Attack: నక్సల్స్.. నెక్ట్స్ ప్లాన్.. భారత్ బంద్?

Maoist Attack: ఛత్తీస్‌గఢ్‌ ఘాతుకం తర్వాత తొలిసారిగా స్పందించారు మావోయిస్టులు.

Update: 2021-04-05 10:10 GMT

Maoist Attack: నక్సల్స్.. నెక్ట్స్ ప్లాన్.... భారత్ బంద్?

Maoist Attack: ఛత్తీస్‌గఢ్‌ ఘాతుకం తర్వాత తొలిసారిగా స్పందించారు మావోయిస్టులు. సీపీఐ మావోయిస్టు సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్‌ 25 వరకు అన్ని ప్రజా ఉద్యమాలకు మద్దతుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 26న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రహార్‌ నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొనవద్దని నక్సల్స్‌ పారా మిలటరీ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, జవాన్లకు విజ్ఞప్తి చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.

పోలీస్‌ ఉద్యోగం మానేయాలని సమదాన్‌-ప్రహార్‌ను ఓడించే ప్రజల ఉద్యమంలో చేరి, మద్దతు ఇవ్వాలని లేఖలో కోరారు మావోయిస్టులు. ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు పోలీసు బలగాలను ఉపయోగించుకుంటున్నాయని, గ్రామాల్లో ప్రజలను పోలీసులు వేధిస్తున్నారని, పోలీసులు ప్రజల యజమానులు కాదు మీకు వేతనాలు చెల్లించేది ప్రజలేనని మావోయిస్టలు తెలిపారు. విప్లవాత్మక కార్యకర్తలను ప్రభుత్వం దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో తెలిపారు మావోయిస్టులు.

ఇదిలా ఉండగా మావోయిస్టుల చెరలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రాకేశ్వర్‌ సింగ్‌ చిక్కుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా స్థానిక మీడియాకు తెలియజేశారు మావోయిస్టులు. రాకేశ్వర్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌ వాసి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌తో ములుగు జిల్లాలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఏజెన్సీలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయస్టులు తెలంగాణ వైపు వస్తారన్న సమాచారంతో అటవీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అడవులను అడుగడుగునా జల్లెడ పడుతున్నారు పోలీసు బలగాలు.

Tags:    

Similar News