Covishield
Covishield: కరోనా వ్యాక్సిన్ ధరల విషయంలో ఎట్టకేలకు సీరం సంస్ధ దిగొచ్చింది. రాష్ట్రాలకు మూడు వందల రూపాయలకే కోవిషీల్డ్ టీకా అందించనున్నట్లు సంస్ధ సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రాలకు ఖర్చు తగ్గించేందుకే నిర్ణయం తీసుకున్నామన్న అదర్ పూనావాలా.. గతంలో ప్రకటించిన ధర కంటే 25శాతం తక్కువని స్పష్టం చేశారు.