కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్

Update: 2021-01-07 10:33 GMT

కరోనా వైరస్ నిరోధానికి తయారవుతున్న కోవాగ్జిన్ టీకా మూడోదశ ట్రయల్స్ సక్సెస్ అయినట్లు భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. నిరంతర శ్రమతో, కఠోర దీక్షతో క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్న కేంద్రాలకు, ఇన్వెస్టిగేటర్లకు, హెల్త్ కేర్ వర్కర్లకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. కోవాగ్జిన్ టీకాను 25,800 మంది వాలంటీర్లపై ప్రయోగించారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ లో వ్యాక్సిన్ తయారీకి కొంత కాలంగా చేస్తున్న పరిశోధనలు, ప్రయత్నాలు సక్సెస్ అవడం పట్ల ఆనందంగా ఉందని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్రా ఎల్లా ఒక ప్రకటనలో తెలిపారు. వాలంటీర్లందరూ తమపై నమ్మకముండి క్లినికల్ ట్రైయల్స్ లో పాల్గొన్నారని, ప్రపంచానికి ఒక కొత్త టీకాను అందించడంలో తమకు తోడ్పాటునందించారన్నారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందుతున్న కరోనా టీకా కోవాగ్జిన్ ఫేజ్ త్రీ ట్రయల్స్ సక్సెస్ పట్ల సంతోషంగా ఉందన్నారు.

Tags:    

Similar News