దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న టాప్ నగరాలు ఇవే

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ వేగంగా పెరిగిపోతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

Update: 2020-05-13 17:00 GMT

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ వేగంగా పెరిగిపోతుంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 75వేలకు చేరువైంది. మరణాల సంఖ్య 2,415కి చేరింది. ఎక్కువగా కేసులు నమోదైన దేశాల్లో చైనాలో 11వ స్థానంలో ఉండగా.. భారత్‌ 12వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా నాలుగైదు రాష్ట్రాల్లోనే ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

మహారాష్ట్ర లో కరోనా కల్లోలం

మహారాష్ట్రలో ఈ రోజు 1,495 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 25,922కి చేరింది. కరోనా కారణంగా 54 మంది మృతి చెందారు. వీరితో కలిపి ఇవప్పటివరకు 975 మంది చనిపోయారు. 5,547 మంది డిశ్చార్జి అయ్యారు. And ముంబయిలో ఇప్పటివరకు 15,747లు నమోదు కాగా, 596 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ఈ రోజు 1,495 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 25,922కి చేరింది. కరోనా కారణంగా 54 మంది మృతి చెందారు. వీరితో కలిపి ఇవప్పటివరకు 975 మంది చనిపోయారు. 5,547 మంది డిశ్చార్జి అయ్యారు. ముంబయిలో ఇప్పటివరకు 15,747లు నమోదు కాగా, 596 మంది మృతి చెందారు.

తమిళనాడు ఉక్కిరిబిక్కిరి

కరోనా కేసులు విషయంలో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. కోవిడ్ కేసులు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోయంబేడు మార్కెట్‌ హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 8718 కేసులు నమోదు అవ్వగా.. 61 మరణాలు సంభవించాయి. అందులో 4,882 కేసులు ఒక్క చెన్నై నగరం నుంచే వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది

ఢిల్లీలో కోవిడ్ దడ

దేశంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలలో డిల్లీ ఒకటి ఇక్కడ విదేశీ ప్రయాణికుల రాకతో తొలుత కేసులు వెలుగుచూడగా.. అనంతరం తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం డిల్లీలో కేసుల పెరుగుదలకు కారణమైంది. ప్రస్తుతం 7,639 కేసులతో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 86 మంది మరణించారు.

గుజరాత్ లో మృత్యుతాండవం

కోవిడ్ కేసుల పరంగా దేశంలోనే గుజరాత్‌ రెండోస్థానంలో నిలిచింది. అహ్మదాబాద్‌ నుంచే ఈ కేసులు ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో 8,903 కేసులు నమోదు అవ్వగా.. 537 మరణాలు సంభవించాయి. ఒక్క అహ్మదాబాద్‌ లోన్ 6,353 కేసులు నమోదు కాగా.. 421 మరణాలు అక్కడే సంభవించాయి.


Tags:    

Similar News