దేశంలో 934కి చేరిన కరోనా మరణాలు
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగపోతోంది గత 24 గంటల్లో 1543 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగపోతోంది గత 24 గంటల్లో 1543 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29435కి చేరింది. ఒక్క రోజే 62 మంది చనిపోవడంతో.. కరోనా వల్ల ఒకే రోజు ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 934కి చేరింది. ఓవైపు కరోనా కొంత వరకూ కంట్రోల్ అవుతోందనిపిస్తున్న సమయంలో తాజా లెక్కలు మరోలా ఉన్నాయి. ఇప్పటివరకు 6868 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 21632 యాక్టివ్ కేసులున్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య చూస్తే:
మహారాష్ట్ర 8590, గుజరాత్ 3548, ఢిల్లీ 3108, మధ్యప్రదేశ్ 2168, రాజస్థాన్ 2262, ఉత్తరప్రదేశ్ 1955, తమిళనాడు 1937, పశ్చిమ బెంగాల్ 697, జమ్మూకాశ్మీర్ 546,కర్ణాటక 512, కేరళ 481, బీహార్ 345, పంజాబ్ 313, హర్యానా 296, ఒడిశా 118, జార్ఖండ్ 82, అండమాన్ నికోబార్ 33, లఢక్ 20, మేఘాలయ 12, పుదుచ్చేరి 8, గోవా 7, ఉత్తరాఖండ్ 51, హిమాచల్ ప్రదేశ్ 40, చండీగర్ 40, ఛత్తీస్‌గఢ్ 37, అసోం 36, మణిపూర్ 2, త్రిపుర 2 మిజోరం 1, అరుణాచల్ ప్రదేశ్ 1.తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ 1183, తెలంగాణ 1004, ఉన్నాయి. గత నాలుగు రోజులుగా ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోవుతున్నాయి. తెలంగాణలో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం రెండు కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అనే అంశంపై సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.