Coronavirus updates in Tamilnadu: త‌మిళ‌నాడులో క‌రోనా కరాళ నృత్యం.. ఒక్కరోజే 97 మంది బ‌లి

Coronavirus updates in Tamilnadu: త‌మిళ‌నాడులో క‌రోనా కరాళ నృత్యం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ క‌రోనాకేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2020-07-31 14:53 GMT
Coronavirus updates in Tamilnadu

Coronavirus updates in Tamilnadu: త‌మిళ‌నాడులో క‌రోనా కరాళ నృత్యం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ క‌రోనాకేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 5,881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా బారిన పడి 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో వైర‌స్ సోకిన బారిన ప‌డిన వారి మొత్తం సంఖ్య 2,24,859 కి చేరింది. కరోనాకు 3,935మంది బ‌ల‌య్యారు. కాగా, క‌రోనా నుంచి 1,83,956 మంది కోలుకున్నార‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది.

ఈ నేప‌థ్యంలో కరోనా కట్టడి చేయడానికి త‌మిళ‌నాడులో లాక్‌డౌన్‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు సీఎం ప‌ళ‌ని స్వామి గురువారం తెలిపారు. అంత‌ర్గ‌, అంత‌ర రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే.. ప్ర‌తి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

పోలీస్‌స్టేష‌న్ మూసివేత‌:

మ‌రోవైపు .. తిరుచులి పోలీస్‌స్టేష‌న్‌లో ఐదుగురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ పోలీస్‌స్టేష‌న్‌ను పూర్తిగా మూసివేశారు. క‌రోనా బారినప‌డ్డ పోలీసులను హాస్పిటల్‌కి త‌ర‌లించారు. వారితో క‌లిసి ప‌నిచేసిన మిగ‌తా పోలీసులను హోమ్ క్వారెంటైన్‌లో ఉంచినట్లు.. త‌మిళ‌నాడు పోలీస్‌శాఖ తెలిపింది.

Tags:    

Similar News