Coronavirus updates in South India: ద‌క్షిణాభార‌తంలో క‌రోనా విల‌యతాండ‌వం

Coronavirus updates in South India: దేశ‌వ్యాప్తంగా క‌రోనా విలయతాండవం చేస్తోంది. ద‌క్షిణ భార‌తంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో క‌ర్ణాట‌క‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తుంది.

Update: 2020-07-30 15:55 GMT
Coronavirus updates in South India

Coronavirus updates in South India: దేశ‌వ్యాప్తంగా క‌రోనా విలయతాండవం చేస్తోంది. ద‌క్షిణ భార‌తంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో క‌ర్ణాట‌క‌లో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తుంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 6,128 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 1,18,632కు చేరింది. సుమారు 69,700 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నార‌ని రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో 83 మంది చ‌నిపోయార‌ని, దీంతో మృతుల సంఖ్య 2,230కి చేరిన‌ట్లు పేర్కొంది.

అటు త‌మిళ‌నాడులోనూ తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,864 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,39,978కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 57,962 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 97 మంది మరణించారు. ఇక కరోనా నుంచి కోలుకుని గురువారం నాడు 5,295 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మ‌రో వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ కరోనా కేసులు ఉధృతి పెరుగుతునే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 10,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 130557కు చేరింది. గడచిన 24 గంటల్లో 68మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరింది. గత 24 గంటల్లో 4,618మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 600024కు చేరింది. మరో 69252మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలోనూ క‌రోనా విభృంజ‌న కొన‌సాగుతుంది. 

Tags:    

Similar News