ఉద్ధవ్ సర్కార్ కీలక నిర్ణయం.. ముంబైలో 144 సెక్షన్..

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు , మరణాలు నమోదైంది కూడా మహారాష్ట్రలోనే.

Update: 2020-05-05 04:46 GMT

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు , మరణాలు నమోదైంది కూడా మహారాష్ట్రలోనే. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 14,541 కరోనా కేసులు, 796 మరణాలు నమోదు కాగా.. ముంబై నగరంలోనే 9 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా మోదీ సర్కారు లాక్‌ డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ముంబై నగరంలో మే 17 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. వైద్యం కోసం మినహా మరే ఇతర పనుల కోసం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రోడ్డెక్కొద్దని ఉద్ధవ్ సర్కారు సూచించింది. నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య కేవలం మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వాహనాలు మాత్రమే రోడ్డు ఎక్కడానికి అనుమతి ఇచ్చింది.

మే 17 వరకు లాక్ డౌన్ విధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులుతో స్థానికంగా కొన్ని మద్యం దుకాణాలను తెరుచారు. దింతో పరిస్థితి గందరగోళంగా మారింది. నగరవ్యాప్తంగా జనం లిక్కర్ కోసం బారులు తీరారు. భౌతిక ఫియరం నిబంధనలను గాలికి వదిలేశారు. దీంతో ముంబై నగరంలో 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది.

Tags:    

Similar News