Coronavirus Updates in India: భారత్‌లో అత్యధికంగా 78,761 పాజిటివ్ కేసులు

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.

Update: 2020-08-30 05:09 GMT

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 35 లక్షల 42 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,761 కేసులు నమోదు కాగా, 948మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 35,42,733 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,65,302 ఉండగా, 27,13,933 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 64,498 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.61 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.79 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.72 శాతంగా ఉంది.


Tags:    

Similar News