లక్షకుపైగా పాజిటివ్ కేసులు 11దేశాల్లోనే.. ఇండియా పరిస్థితి చూస్తే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. అన్ని దేశాల్లో ఇప్పటికే దాదాపు 49లక్షల మందికి ఈ వైరస్ సోకగా వీరిలో మూడు లక్షల 20వేల మంది మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. అన్ని దేశాల్లో ఇప్పటికే దాదాపు 49లక్షల మందికి ఈ వైరస్ సోకగా వీరిలో మూడు లక్షల 20వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 11దేశాల్లో లక్ష కేసుకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో ఇండియాలో మంగళవారం నాటికి 1,01,139 పాజిటివ్ కేసులతో 11వ స్థానానికి ఎగబాకింది. అయితే, 100కేసుల నుంచి లక్ష కేసులు నమోదుకావడానికి ఇండియాకి 64రోజుల సమయం పట్టింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న అమెరికా, స్పెయిన్‌లలో కన్నా లక్ష కేసులు నమోదుకావడానికి భారత్ రెట్టింపు రోజుల సమయం తీసుకుంది.
ప్రపంచంలోనే 2వా అతిపెద్ద జనాభా గల ఇండియా, కరోనా వైరస్ కట్టడిలో అద్బుత పనితీరు కనబరిచిందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కోవిడ్ వ్యాప్తిని తగ్గించడంతోపాటు మరణాలు సంఖ్యలోనూ ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో కరోనా మరణాల రేటు 16శాతం ఉండగా... భారత్‌లో దాదాపు మూడు నెలలశాతం ఉండటం ఊరటనిచ్చే విషయం. ఇదిలాఉంటే, మంగళవారం నాటికి ఇండియాలో మొత్తం 1,01,139 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3163 మంది మరణించారు. అంతేకాకుండా భారత్‌లో రికవరి రేటు కూడా ఆశాజనకంగా ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్-19 రికవరి రేటు దాదాపు 38శాతంగా ఉంది.
ఆరోగ్య సదుపాయాలున్న ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో వైరస్ విజృంభణతో ఇండియాలో లక్ష కంటే తక్కువ రోజుల్లోనే వంద నుంచి లక్ష పాజిటివ్ కేసులు నమోదుచేసుకున్నాయి. ఆ సమయంలో వేగంగా విస్తరిస్తోన్న వైరస్‌ను కట్టడి చేయడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయి...
అమెరికాలో కేవలం 25రోజుల్లోనే వంద నుంచి లక్షమందికి సోకగా స్పెయిన్‌లో 30 రోజులు, జర్మనీలో 35రోజుల్లో లక్ష కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ తీవ్రతకు అతలాకుతలమైన ఇటలీలో 36 రోజుల్లో లక్ష కేసులు దాటగా ఫ్రాన్స్‌కు 39 రోజులు, బ్రిటన్‌కు 42రోజుల సమయం పట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మందికి సరాసరి 60 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. భారత్‌లో మాత్రం ఇది 7.1గా ఉంది. అదే అమెరికాలో మాత్రం ప్రతి లక్ష జనాభాకు 431మంది కరోనా వైరస్ బారినపడినట్లు నివేదికల్లో తెలిపింది. బ్రిటన్‌లో ప్రతి లక్ష జనాభాకు 361 మంది, ఈ వైరస్ బారినపడుతున్నారు.