ఇండియాలో డేంజర్ బెల్స్.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురికి పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో కరోనాతో 900 మంది మృతి చెందారు.

Update: 2020-06-05 12:43 GMT

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో కరోనాతో 900 మంది మృతి చెందారు. మొదటి వెయ్యి మరణాల నమోదుకు 48 రోజుల సమయం పడితే, నాలుగు రోజుల్లోనే 900 మంది మృతి చెందడంతోనే కరొనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.భారత్ లో మొదటి 26,496 కేసుల నమోదుకు పట్టిన 87 రోజుల సమయం పట్టింది. గడిచిన 6 వారాల్లో భారత్ లో 2 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ సడలింపులతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని, మరణాలు సంఖ్య కూడా మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.       ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 2,26,770 చేరాయి. 6348 మంది మహమ్మరి బారిన పడి మృతి చెందారు. మరోవైపు ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ముగ్గురు అధికారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. శనివారం, ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మూసివేయనున్నారు. శానిటైజేషన్ పూర్తయిన తరువాత తెరుచుకొనున్నాయి.

రెండు రోజులపాటు అధికారులకు,సందర్శకులకు లోనికి అనుమతి లేదని ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉద్యోగులు పాటించాల్సిన 40 నిబంధనల్ని అధికారులు విడుదల చేశారు. మాస్కులు తప్పనిసరి,కంటైనమెంట్ జోన్ల నుంచి వచ్చే డ్రైవర్లు అనుమతి నిరాకరణ,సామాజిక దూరం పాటించడం, ఏసీల వాడకం నిలుపుదల,ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒక చోట ఉండటం పై నిషేధం,నేరుగా ఫైల్స్ తీసుకోవడం నిషేధం,ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించే సమావేశాలకు మినహాయింపులతో నిబంధనలు విధించారు.

Tags:    

Similar News