Coronavirus Negligence: కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం.. తెస్తుంది పెను ప్రమాదం!

Update: 2020-07-04 09:39 GMT

Coronavirus Negligence : కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రతి రోజు వందల్లో కేసులు పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఈ లెక్కలన్నీ చూసిన జనం భయపడుతున్నారే తప్పా జాగ్రత్త చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా అవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ వరకు రాదనే నిర్లక్ష్యం తనకు ఏం కాదనే మెండీ ధైర్యంతో తిరుగుతున్నారు. కానీ కరోనాకు తమపర బేధాలుండవు.

కరోనా రక్కసి రోజుజోజుకు భయానక పరిస్థితులు సృష్టిస్తోంది. కానీ జనాల్లో మాత్రం అదే నిర్లక్ష్యం, జాగ్రత్త చర్యలను గాలికి వదిలేస్తున్నారు. తమకేం కాదనే మొండీ ధైర్యంతో వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించాలి. క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇదే కరోనా అంతానికి మార్గం. కానీ కొందరు ఇవేం పట్టనట్లు వ్యవహిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో సైతం ప్రజలు యధేచ్ఛగా తిరుగుతున్నారే తప్పా జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదు.

జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా ఎవరినైన బలితీసుకుంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. బయట స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరికీ వారు సెల్ఫ్ లాక్ డౌన్ లోకి వెళ్తేనే మంచిదని అంటున్నారు. కరోనా డేంజర్ బెల్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఒక్కరి నిర్లక్ష‌్యం కారణంగా కుటుంబసభ్యులు, స్నేహితులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్త చర్యలు పాటించి, తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి.

Tags:    

Similar News