Corona Symptoms: ఊసరవెల్లిలా కరోనా రూపాలు.. వ్యాధి లక్షణాల్లోనూ మార్పులు

Corona Symptoms: కరోనా వేషాలకు లెక్కలేదు. వైరస్‌ వ్యా్ప్తికి అడ్డులేదు. మహమ్మారికి తెలిసిందొక్కటే చావుదెబ్బ కొట్టడం.

Update: 2021-04-27 08:17 GMT

Coronavirus: ఊసరవెల్లిలా కరోనా రూపాలు.. వ్యాధి లక్షణాల్లోనూ మార్పులు

Corona Symptoms: కరోనా వేషాలకు లెక్కలేదు. వైరస్‌ వ్యా్ప్తికి అడ్డులేదు. మహమ్మారికి తెలిసిందొక్కటే చావుదెబ్బ కొట్టడం. కట్టెకు పట్టే చెదపురుగుల లెక్క, మనిషి శరీరాన్ని గుల్ల చేస్తోంది కోవిడ్‌. ఊసరవెల్లిలా రంగులు, రూపాలు మార్చుతూ దొరికినవాళ్లను దొరికినట్టు ఆవహిస్తోంది. తానేంటో చూపిస్తానని వేలాదిమంది ప్రాణాలను హరిస్తోంది. మరిన్ని వ్యాధులను అంటించి వణుకు పుట్టిస్తోంది.

జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే అది కరోనానే కావొచ్చనే అనుమానం ఒకప్పుడు అందరిలో ఉన్న అనుమానం. కానిప్పుడు తలనొప్పి, వాంతులు, విరేచనాలతోపాటు నీరసం ఇలా ఏ ఒక్క లక్షణం ఉన్నా అది కరోనా కావొచ్చనే అనుమానపడాలని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి‌. అవును మొదటిదశలో కనిపించని అనేక లక్షణాలు రెండోవేవ్‌లో కనిపిస్తున్నాయి.

గతంలో పదిమందిలో ఒకరిద్దరికి సోకిన కరోనా ఇప్పుడు ఏడెనిమిది మందికి సోకుతోంది. చెప్పాలంటే దాని తీవ్రత కూడా ఎక్కువైంది. దీంతో ఆసుపత్రుల్లో చేరేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సరైన చికిత్స అందించేలోపే పరిస్థితి విషమిస్తోంది. మొత్తానికి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పెట్టినా బతికించుకోలేని దుస్థితి ఎదురవుతోంది.

మొదటి దశలో పిల్లల జోలికే వెళ్లని వైరస్‌ ఇప్పుడు ఎవ్వరినీ వదలటం లేదు. ఇక యువత కనిపించటమే పాపమన్నట్టూ కక్ష కట్టినట్టు దారుణంగా దాడి చేస్తోంది. ఇక గతంలో మొదటి వేవ్‌ ప్రారంభమైన ఆరు నెలల కాలంలో సెప్టెంబర్‌ 18 నాటికి 30వేల 673 యాక్టివ్‌ కేసులు ఉండగా రెండో వేవ్‌ ప్రారంభమైన కేవలం రెండు నెలల కాలంలోనే ఆ సంఖ్య 46వేల 488కి చేరుకుంది.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యతోపాటు పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుంది. ఈ పెరుగుదల మే రెండోవారం వరకు కొనసాగవచ్చని వైద్యులు చెప్తున్నారు. మార్చిలో వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉన్నా ఏప్రిల్‌‌లో వేగం పెరిగింది. అయితే ఇప్పుడున్న వైరస్‌ వేగం మే నెల రెండోవారం తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News