ఆంఫాన్ తుఫాన్ ఎఫెక్ట్ : ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా
ఏదో పుణ్యానికి వెళితే పాపం వెంటొచ్చినట్టయింది ఎన్టీఆర్ఎఫ్ పరిస్థితి. ఆంఫన్ తుపాను ప్రభావంలో బాధితులను రక్షించేందుకు వెళ్లిన వీరిని కరోనా వెంటాడింది.
ఏదో పుణ్యానికి వెళితే పాపం వెంటొచ్చినట్టయింది ఎన్టీఆర్ఎఫ్ పరిస్థితి. ఆంఫన్ తుపాను ప్రభావంలో బాధితులను రక్షించేందుకు వెళ్లిన వీరిని కరోనా వెంటాడింది. వీరంతా భౌతిక దూరం పాటించకుండా కలిసి పని చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అయితే వీరికి ఎటువంటి ఇబ్బంది లేదని, వారిని ప్రత్యేక క్వారెంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఒడిశా ప్రభుత్వం చెప్పింది.
ఆంఫాన్ తుఫాన్ దాటికి బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఎలా వణికిపోయాయో అందరికీ తెలిసిందే. భారీగా ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం తక్కువగా ఉండేందుకు కృషి చేసిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి ఇప్పుడు అనుకోని కష్టం వచ్చిపడింది.
ఆంఫాన్ తుఫాన్ సమయంలో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ఎంతో పట్టుదలతో, శ్రమతో పనిచేశారు. కానీ అలాంటి విపత్కర సమయంలో భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదు. కానీ అదే ఇప్పుడు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ సోకేందుకు కారణం అయ్యింది. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వారిలో దాదాపు 50మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారికంగా దృవీకరించారు. ఇక ఎన్టీఆర్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోనూ మరో 26 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
కరోనా బారినపడ్డ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందరూ.. కటక్ ప్రాంతానికి చెందిన 3వ బెటాలియన్‌కు చెందినవారని తెలుస్తోంది. వీరిలో కొంత మందిని కటక్‌లో మరి కొంత మందిని భువనేశ్వర్‌లో క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికీ ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని ఎన్డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ్ ప్రధాన్ తెలిపారు