Coronavirus in India Updates: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 4 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

Coronavirus in India Updates: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా కొవిడ్‌ కేసుల సంఖ్య 4 వేలు దాటింది.

Update: 2025-06-03 08:48 GMT

Coronavirus in India Updates: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 4 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

Coronavirus in India Updates: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా కొవిడ్‌ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకరం సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ కొత్తగా 64 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల్లో ఐదుగురు మరణించారు.


జూన్‌ 3 ఉదయం 8 గంటల సమయానికి దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,026కి పెరిగింది. కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో కొనసాగుతోంది. కొత్తగా 171 కరోనా కేసులు నమోదు కావడంతో, కేరళలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,416కి చేరింది. మహారాష్ట్రలో 494, గుజరాత్‌లో 397, ఢిల్లీలో 393, పశ్చిమబెంగాల్‌లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదు చూశాయి.


గత 24 గంటల్లో మహారాష్ట్రలో ఇద్దరు, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 37కి పెరిగింది.

Tags:    

Similar News