Corona Variant: దేశంలో B.1.617 రకమే ప్రస్తుత విలయానికి కారణం- డబ్ల్యూహెచ్‌ఓ

Corona Variant: భారత్‌లో విస్తరిస్తున్న కరోనా రకానికి వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను సైతం ఇది తప్పించుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.

Update: 2021-05-10 06:55 GMT

Corona Variant: దేశంలో B.1.617 రకమే ప్రస్తుత విలయానికి కారణం- డబ్ల్యూహెచ్‌ఓ

Corona Variant: భారత్‌లో విస్తరిస్తున్న కరోనా రకానికి వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను సైతం ఇది తప్పించుకునే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. గత అక్టోబర్‌లో గుర్తించిన బి.1.617 రకమే భారత్‌లో ప్రస్తుత కరోనా విలయానికి కారణమని స్పష్టం చేసింది. దేశంలో కరోనా ఉద్ధృతికి వైరస్‌ కొత్త రకాలు ఒక్కటే కారణం కాదన్న డబ్ల్యూహెచ్‌ఓ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యేలా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా ఒక కారణమని అభిప్రాయపడింది.

సాధారణంగా భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి నెమ్మదిగా ఉండాల్సిందని, ఫస్ట్‌ వేవ్‌ సమయంలో అది జరగిందని, కానీ కేసులు ఒక్కసారిగా పెరగడం ప్రారంభమైన తర్వాత వైరస్‌ వ్యాప్తిని ఆపడం కష్టంగా మారింది. మరోవైపు దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినే శ్రీరామరక్షగా భావిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వల్ల పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేమని చెప్పింది డబ్ల్యూహెచ్‌ఓ. భారీ స్థాయిలో రూపాంతరం చెందిన వైరస్‌ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చునని అభిప్రాయపడింది. దేశ జనాభా దాదాపు 130 కోట్లు కాగా ఇప్పటివరకు కేవలం రెండు శాతం మందికే టీకా అందిందని స్పష్టం చేసింది. మిగిలినవారికి వ్యాక్సిన్ అందాలంటే కొన్ని నెలల సమయమైనా పడుతుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

Tags:    

Similar News