India Open 2022: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కొవిడ్ కలకలం

India Open 2022: భారత్‌కు చెందిన ఏడుగురు షట్లర్లకు కరోనా పాజిటివ్

Update: 2022-01-13 07:02 GMT

 భారత్‌కు చెందిన ఏడుగురు షట్లర్లకు కరోనా పాజిటివ్

India Open 2022: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కొవిడ్ కలకలం సృష్టించింది. భారత్‌కు చెందిన ఏడుగురు షట్లర్లకు కరోనా సోకింది. కిదాంబి శ్రీకాంత్‌ సహా ఏడుగురు క్రీడాకారులకు కరోనా నిర్ధారణ అయింది. అశ్వనిపొన్నప్ప, రితికా రాహుల్, త్రిసాజోలి, మిథున్‌ మంజునాథ్, సిమ్రన్ అమన్‌సింగ్, ఖుషీగుప్తాలకు కొవిడ్ సోకినట్లు ప్రపంచ బ్మాడ్మింటన్ ఫెడరేషన్ తెలిపింది. ప్రస్తుతం వీరంతా ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నారు.

మరోవైపు ఈ క్రీడాకారుల డబుల్స్‌ పార్ట్‌నర్స్‌ సైతం టోర్నీ నుంచి వైదొలిగారని BWF వెల్లడించింది. దీంతో ఇప్పుడు టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో BAI ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది. టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News