Corona Deaths: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా మరణాలు

Corona Deaths: కరోనా తీవ్రత మెల్లమెల్లగా తగ్గుతోంది. దేశంలో దాదాపు 50 రోజుల తర్వాత మరణాలు అతి తక్కువగా నమోదు అయ్యాయి.

Update: 2021-06-01 12:33 GMT

Corona Deaths: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా మరణాలు

Corona Deaths: కరోనా తీవ్రత మెల్లమెల్లగా తగ్గుతోంది. దేశంలో దాదాపు 50 రోజుల తర్వాత మరణాలు అతి తక్కువగా నమోదు అయ్యాయి. అయితే.. మే నెలలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. నెల రోజుల్లోనే దాదాపు 89లక్షల మందికి కరోనా సోకింది. మహమ్మారి బారిన పడి 1.17 లక్షల మంది మరణించారు. ఇప్పటి వరకు నమోదైన 2.80 కోట్ల కేసుల్లో ఇవి 31.67 శాతంగా ఉంది. 3.29 లక్షల మంది బాధితుల మరణాలల్లో 35.63 శాతంగా నమోదు అయింది. వైరస్‌తో అతలాకుతలమైన అగ్రరాజ్య అమెరికాలో మేలో 8 లక్షల కేసులు నమోదు అయ్యాయి. మనదగ్గర దానికి 11 రెట్లు ఎక్కువగా వచ్చాయి. ఏప్రిల్‌తో పోలిస్తే భారత్‌లో పాజిటివ్‌లు 20 లక్షలు, మరణాలు 60శాతం అధికంగా నమోదు అయ్యాయి. ఏప్రిల్‌లో రోజుకు సగటున 16వందల 31 మంది చనిపోగా, మేలో సుమారు 4వేల మంది మృతి చెందారు.

ప్రపంచంలో మరేదేశంలోనూ లేనంతగా గత నెలలో భారత్‌లో ఉధృతి కొనసాగింది. కేసులు, మృతుల సంఖ్యపరంగా గత నెలలో రికార్డులు నమోదయ్యాయి. మే 4న మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2కోట్లు దాటింది. అదేనెల 7న అత్యధికంగా 4.14 లక్షల కేసులు వచ్చాయి. ఇక మే 19 రికార్డు స్థాయిలో 4వేల 529 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మే ద్వితీయార్థం నుంచి దేశంలో వైరస్ ఉద్ధృతి నెమ్మదించింది. తొలి 15 రోజుల కంటే ఆ తర్వాత 15 రోజులు కాస్త ఉపశమణం కలిగించింది. ఆ సమయంలో 42శాతం కేసులు తగ్గాయి. కానీ, మృత్యుఘోష మాత్రం ఆగలేదు. జూన్ మొదటి వారంలో మరణాల శాతం కూడా తగ్గే అవకాశం ఉంది.

Tags:    

Similar News