Corona Cases in India: భారత్ లో 3 కోట్లు దాటిన కరోనా కేసులు

Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.

Update: 2021-06-23 04:35 GMT

(క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మ‌క చిత్రం)



Corona Cases in India: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న రోజువారీ కేసులు 42వేలకు చేరగా.. మళ్లీ పెరిగాయి. కొత్తగా దేశంలో 50,848 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు మూడు కోట్ల మార్క్‌ను దాటాయి. నిన్న మరో 1,358 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ముందురోజు కంటే మరణాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం మొత్తం కేసులు మూడు కోట్ల మార్కును దాటగా.. 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా.. 68,817 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో వైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య దిగి వస్తున్నది. 82 రోజుల కనిష్ఠానికి చేరాయని, ప్రస్తుతం 6.43లక్షలకు చేరాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది. ఇప్పటి వరకు 2,89,94,855 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 6,43,194 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది. మరోపక్క నిన్న 54,24,374 మందికి టీకా అందింది. ఇప్పటివరకు 29కోట్ల 46లక్షలకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags:    

Similar News