Uttar Pradesh: లఖీంపూర్ ఘటనపై కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు
*రాష్ట్రపతిని కలిసేందుకు సిద్ధమైన ఏడుగురు సభ్యుల రాహుల్ టీమ్ *లఖీంపూర్ ఘటనపై వాస్తవాలు రాష్ట్రపతికి వివరిస్తామన్న రాహుల్
లఖీంపూర్ ఘటనపై కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు(ఫైల్ ఫోటో)
Uttar Pradesh: లఖీంపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపింది. ఇదే విషయమై అపాయింట్‌మెంట్ కోరుతూ రాష్ట్రపతి భవన్‌కు లేఖ రాసింది. రాష్ట్రపతిని కలిసే టీమ్‌లో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదురి ఉన్నారు.