రైతులకు మద్దతుగా ట్రాక్టర్ నడిపిన కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే

* ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ఇందిరా మీనా * సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మీనా వీడియో

Update: 2021-02-11 02:04 GMT

Rajasthan MLA  

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. రైతుల ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా మద్ధతు వస్తోంది. రైతుల ఉద్యమానికి దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న సందర్భంగా కాంగ్రెస్ మహిళా ఎమ్మె్ల్యే ట్రాక్టర్ పై వచ్చి రైతులకు తన మద్దతు తెలిపింది.

 రాజస్థాన్ ఎమ్మెల్యే ఇందిరా మీనా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలుపుతూ తానే ఇలా ట్రాక్టర్ పై అసెంబ్లీకి వచ్చానని ఇందిరా మీనా తెలిపారు. ఆమె ట్రాక్టర్ నడుపుతూ అసెంబ్లీకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Tags:    

Similar News