Jairam Ramesh: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు
Jairam Ramesh: ఉగ్రవాదంపై భారత్ ఎప్పుడూ రాజీపడదన్న జైరాం రమేష్
Jairam Ramesh: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు
Jairam Ramesh: కెనడా విషయంలో భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తన సోషల్‌మీడియా అకౌంట్లో ఈ విషయాన్నీ స్పష్టం చేస్తూ దేశ ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యంగా ఉగ్రవాదంపై భారత్ దేశం ఎప్పుడూ రాజీ పడదని రాశారు. భారతదేశం తీవ్రవాదిగా ముద్ర వేసిన ఖలిస్థాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో కెనడా వైఖరిపై భారత్ దీటుగా స్పందించింది. కెనడాలోని భారత దౌత్యాధికారిని బహిష్కరించిన నేపథ్యంలో భారత్ లోని కెనడా హైకమిషనర్‌ని కూడా బహిష్కరించి ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.