Rahul Gandhi Questions To Government : దీన్ని కూడా 'యాక్ట్ ఆఫ్ గాడ్' అంటారా?

Rahul Gandhi Questions To Government : చైనా- భారత్ సరిహద్దులో వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం పైన విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

Update: 2020-09-11 08:32 GMT

Rahul Gandhi 

Rahul Gandhi Questions To Government : చైనా- భారత్ సరిహద్దులో వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం పైన విమర్శలు చేస్తూనే వస్తున్నారు.. జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్ధిక వ్యవస్థ పతనం నేపథ్యంలో అది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వాఖ్యను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఎద్దవా చేశారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. భారత ప్రభుత్వం దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకురాగలుగుతుంది? అని ప్రశ్నించారు. లేకపోతే దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ (దైవ ఘటన) ఖాతాలో వేసేస్తారా అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మాస్కోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా గురువారం సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన చైనా ప్రతినిధి వాంగ్ యిని కలిసిన తరువాత రాహుల్ ఈ ట్వీట్ చేశారు.

ఆగస్టు 27 న జిఎస్టి కౌన్సిల్ 41 వ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ ఈ ఏడాది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని అన్నారు.. జీఎస్టీ వసూళ్లపై కరోనా వైరస్‌ ప్రభావం చూపిందని, దాని కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.65వేల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ఆమె యాక్ట్ ఆఫ్ గాడ్ అనే పదాన్ని వాడారు.. దీనిపైన కాంగ్రెస్ నేతలు చిదంబరంతో పాటుగా పలువురు తీవ్ర విమర్శలు చేశారు.



Tags:    

Similar News