Rahul Gandhi : రాహుల్ గాంధీని అడ్డుకుంటే కాంగ్రెస్‌ పార్టీ నాశనమే!

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ సమూలంగా నాశనం అవుతుందని శివసేన ఎంపీ

Krishna
Published on: 30 Aug 2020 9:32 PM IST
Rahul Gandhi : రాహుల్ గాంధీని  అడ్డుకుంటే కాంగ్రెస్‌ పార్టీ నాశనమే!
X

Sanjay Raut

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ సమూలంగా నాశనం అవుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.. గాంధీయేతర సారధి ఉంటే మేలని 23మంది కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీకి రాసిన లేఖలో ఒక్కరు కూడా సమర్ధులు లేరని అయన ఆన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సరితూగే స్ధాయి కలిగిన నేత కాంగ్రెస్‌లో ఒక్కరు కూడా లేరని రౌత్‌ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ని వీడి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న వారిని తిరిగి ఒక గూటికి తీసుకురాగలిగితే కాంగ్రెస్ మళ్ళీ మన దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించగలదని అయన అభిప్రాయపడ్డారు.. కాంగ్రెస్‌ పార్టీ అనేది ఓ ముసలవ్వ లాంటిదని, అది ఎప్పటికీ మరణించదంటూ వీఎన్‌ గాడ్గిల్‌ చేసిన వ్యాఖ్యలను అయన తన వ్యాసంలో పేర్కొన్నారు. అయితే అలాంటి వృద్ధురాలితో ఏమి చేయాలో రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలని హితువు పలికారు సంజయ్ రౌత్..

వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పార్టీని ప్రక్షాళన చేయాలనీ కోరుతూ 23మంది కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీకి లేఖ రాశారు..ఈ లేఖ పెద్ద కలకలమే రేపింది.. ఏకంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ల పైన మండిపడ్డారు.. సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం ఏంటి అని సీడబ్ల్యూసీ భేటీలో అయన సీనియర్ల పైన ఫైర్ అయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి అందరికి విధితమే.

Krishna

Krishna

Next Story