కాంగ్రెస్ ఆవిర్భావదినోత్సవంలో అపశ్రుతి.. సోనియా చేతులపై పడిన..
Congress Party Flag: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ఆవిర్భావదినోత్సవంలో అపశ్రుతి.. సోనియా చేతులపై పడిన..
Congress Party Flag: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జెండా ఎగురవేస్తున్నప్పుడు అది ఒక్కసారిగా కిందపడిపోయింది. జెండా ఆవిష్కరణ చేయాల్సిన సోనియా దాన్ని నేలపై పడకుండా చేతులతో పట్టుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె జెండాను చేతులతో పైకెత్తి పార్టీ శ్రేణులకు చూపించి మిగతా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.