Cylinder Prices : సామాన్యుడికి గుడ్ న్యూస్.. పండుగ సీజన్ స్టార్టింగులోనే భారీగా తగ్గిన సిలిండర్ ధర
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను వాడే వాళ్లకు గుడ్ న్యూస్. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి తగ్గించాయి. ఈసారి ధరలు రూ. 51 వరకు తగ్గించాయి.. అయితే, ఈ తగ్గింపు కేవలం 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది.
Cylinder Prices : సామాన్యుడికి గుడ్ న్యూస్.. పండుగ సీజన్ స్టార్టింగులోనే భారీగా తగ్గిన సిలిండర్ ధర
Cylinder Prices : ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను వాడే వాళ్లకు గుడ్ న్యూస్. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి తగ్గించాయి. ఈసారి ధరలు రూ. 51 వరకు తగ్గించాయి.. అయితే, ఈ తగ్గింపు కేవలం 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1580 అవుతుంది. ఇప్పటి వరకు ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1631.50గా ఉంది. కొత్త ధరలు నేటి నుంచి అంటే సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తాయి.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పు చేశాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఈ రోజు నుండి రూ. 51.50 తగ్గించబడింది. ఢిల్లీలో సెప్టెంబర్ 1 (ఈరోజు) నుండి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకం ధర రూ. 1580 ఉంటుంది. కోల్‌కతాలో కొత్త ధర రూ. 1,684, ముంబైలో కొత్త ధర రూ. 1,531.5. చెన్నైలో కొత్త ధర రూ. 1,738.ఇక పోతే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,801.50గా ఉంది. ఇక 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 905గా కొనసాగుతోంది.
మార్చి నెల మినహాయిస్తే, జనవరి 1, 2025 నుండి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరంగా తగ్గుతున్నాయి. జనవరి 1న రూ. 14.50 తగ్గింపు లభించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రూ. 7 తగ్గింపు జరిగింది. అయితే, మార్చి 1న ధరలు రూ. 6 పెరిగాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1న భారీ తగ్గింపు చేస్తూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 41 తగ్గించారు. దీని తర్వాత మే 1న రూ. 14, జూన్ 1న రూ. 24 తగ్గింపు జరిగింది. జూలై 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలలో రూ. 58.50 భారీ తగ్గింపు జరిగింది. ఆ తర్వాత ఆగస్ట్ 1న మరోసారి రూ. 33.50 తగ్గింపు జరిగింది. ఇప్పుడు ధరలు మరోసారి తగ్గాయి.