ఉక్రెయిన్ లో తుపాకీ పట్టిన భారత యువకుడు

Sai Nikesh: ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులంతా ఇండియా తిరిగిరావాలని తహతహలాడుతుంటే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు

Update: 2022-03-08 15:40 GMT

ఉక్రెయిన్ లో తుపాకీ పట్టిన భారత యువకుడు

Sai Nikesh: ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులంతా ఇండియా తిరిగిరావాలని తహతహలాడుతుంటే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఉక్రెయిన్ తరఫున పోరాటంలో పాల్గొనడం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సైనికుడి దుస్తుల్లో తుపాకీ పట్టి దేశం కోసం యుద్ధ రంగంలో నిలవాలన్న యువకుడి కల ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అయితే మాతృభూమి ఆ అవకాశం ఇవ్వకపోతే ఉద్యోగం ఇచ్చిన పరాయి భూమిలో సైనికుడిగా ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సాయి నిఖేశ్ ఉద్యోగం కోసం ఉక్రెయిన్ కు వెళ్లాడు. పేరెంట్స్, కుటుంబ సభ్యులతో టచ్ లో ఉంటున్నాడు. అయితే యుద్ధానికి కొద్ది రోజుల ముందు నుంచి ఫ్యామిలీతో కమ్యూనికేషన్స్ కట్టయ్యాయి. సాఫ్ట్ వేర్ జాబ్ కోసం వెళ్లిన 21 ఏళ్ల సాయి నిఖేశ్ ఉక్రెయిన్ కు వెళ్లకముందు నుంచే సైన్యంలో చేరాలని కలలు గనేవాడు. భారత సైన్యంలో చేరేందుకు చాలాసార్లు ప్రయత్నించినా సెలెక్ట్ కాలేకపోయాడు. అవకాశం వస్తే అమెరికా సైన్యంలో చేరాలనుకున్నాడు. అదీ కుదరలేదు.

రష్యా-ఉక్రెయిన్ వార్ కన్ఫామ్ అయ్యి తారస్థాయికి చేరాక గానీ అసలు విషయం బయటి ప్రపంచానికి తెలియలేదు. పౌరులందరూ యుద్ధంలో పాల్గొనాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చిన క్రమంలో, భారతీయులంతా వెనక్కి వస్తున్నప్పుడు సాయినిఖేష్ పేరెంట్స్ తమ కుమారుడి గురించి ఇండియన్ ఎంబసీ ద్వారా ఆరా తీయడంతో అప్పుడు అసలు విషయం బయటపడింది. అయితే ఫ్యామిలీ నుంచి మరిన్ని వివరాలు తీసుకున్న భారత దౌత్యాధికారులు తాజాగా సాయినిఖేశ్ తో టచ్ లోకి వెళ్లారు. అతని వెనక్కి రావాల్సిందిగా కోరారు. కానీ సాయి నిఖేష్ ఉక్రెయిన్ ను వీడి రానని, రష్యాతో యుద్ధం చేస్తానని బదులిచ్చినట్లు తెలుస్తోంది. తుపాకీ పట్టి ఉక్రెయిన్ సేనలతో కలిసి యుద్ధంరంగంలో దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.

మొత్తానికి సైన్యంలో చేరాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉన్న సాయినిఖేశ్ ఆ కోరికను మాత్రం ఇలా తీర్చుకుంటున్నాడు. ఈ ఉదంతంతో సైన్యంలో చేర్చుకునే నిబంధనలు కూడా కొంతైనా మారిస్తే బావుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News