ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటీ... 10 అంశాలపై చర్చ..

* కృష్ణా గోదావరి బోర్డుల గెజిట్‌పై ప్రధానితో సీఎం చర్చ * పది అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన కేసీఆర్

Update: 2021-09-03 14:28 GMT

ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటీ... 10 అంశాలపై చర్చ..

Delhi: ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. అలాగే పది అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానికి వినతిపత్రం అందజేశారు. ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, కొత్త జిల్లాలకు సరిపడా ఐపీఎస్‌లను కేటాయించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ - నాగ్‌పూర్ ఇండస్ట్రియల్‌ కారిడార్‌పై కూడా సీఎం కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. అలాగే కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని ప్రధానిని సీఎం కోరారు. తెలంగాణ గిరిజన వర్సిటీ, IIM, కరీంనగర్‌కు IIIT కోసం కూడా సీఎం వినతిపత్రం అందజేశారు. మరోవైపు వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని మోడీని కేసీఆర్ కోరారు.

Tags:    

Similar News