Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్
Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది.
Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్
Cloudburst: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. డెహ్రాడూన్ ను వరదలు ముంచెత్తాయి. కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో పలు ఇల్లు ధ్వంసం అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ, సిబ్బంది గాలిస్తున్నారు. NDRF, SDRF సిబ్బంది సహాయకచర్యల్లో నిమగ్నం అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు చేరుకొని నష్టం అంచనా వేస్తున్నారు. డెహ్రాడూన్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.