Supreme Court: ముగిసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

Supreme Court:న్యాయస్థానం చరిత్రలో తొలిసారి జడ్జీల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. *9 మంది జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించిన సీజేఐ ఎన్‌వీ రమణ

Update: 2021-08-31 06:36 GMT

సుప్రీమ్ కోర్టు (ది హన్స్ ఇండియా )

Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారమహోత్సవం ముగిసింది. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి జడ్జీల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం మాత్రమే ప్రత్యక్ష ప్రసారమయ్యేది. ఇప్పుడు తొలిసారి న్యాయమూర్తుల బాధ్యతల స్వీకారం కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతేగాక, ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం కూడా ఇదే తొలిసారి.

సుప్రీం జడ్జీల నియామకం కోసం కొలీజియం పంపిన 9 మంది పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో వీరంతా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కొత్త న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రమాణం చేయించారు. కరోనా ప్రభావం కారణంగా ఈసారి ప్రమాణస్వీకార వేదికను మార్చారు. 1వ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అదనపు భవనం ఆడిటోరియానికి మార్చారు.

Tags:    

Similar News