చైనా వాటర్ బాంబ్ ప్రాజెక్ట్ Indiaకు ముప్పా? బ్రహ్మపుత్ర నదిపై భారీ Hydropower ప్రాజెక్ట్ కలకలం

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద జల విద్యుత్తు ప్రాజెక్ట్‌ వల్ల భారత్‌కు పర్యావరణ, నీటి భద్రత పరంగా ముప్పు ఉందా? అరుణాచల్, అస్సాం రాష్ట్రాలకు ఏ ముప్పు ఉన్నా? అస్సాం సీఎం ఏమన్నారో తెలుసుకోండి.

Update: 2025-07-22 06:09 GMT

China's Water Bomb Project on Brahmaputra: A Threat to India?

టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించనున్న ప్రపంచంలోని అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారత్‌లో ఆందోళనలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. దాదాపు రూ. 14 లక్షల కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌ను "వాటర్ బాంబ్"గా అభివర్ణిస్తూ, ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ డ్యాం నిర్మాణాన్ని హిమాలయాల్లోని టిబెట్ ప్రాంతంలో, బ్రహ్మపుత్ర నది వంపు తిరిగే ప్రాంతంలో చేపట్టడం వల్ల, పర్యావరణం, నీటి ప్రవాహాలపై తీవ్రమైన ప్రభావాలు కనిపించవచ్చని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్‌, బంగ్లాదేశ్‌లపై ప్రతికూల ప్రభావాలు ఉండవని చైనా చెబుతున్నా, ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే ఒక్కసారిగా నీటిని వదిలితే ముప్పే మిగులుతుందన్నది భారత వాదన.

భారీ Hydropower Plant – త్రీగోర్జెస్ కంటే 3 రెట్లు పెద్దది

చైనా చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ఇది గతంలో చైనా నిర్మించిన Three Gorges Dam కంటే 3 రెట్లు పెద్దది కావడం గమనార్హం.

అస్సాం సీఎం స్పష్టత

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ వల్ల ఇప్పటికిప్పుడు భారత్‌కి ముప్పు ఏమీ లేదని పేర్కొన్నారు. బ్రహ్మపుత్ర నదిలో భారత్‌కి వచ్చే నీటిలో కేవలం 30-35% మాత్రమే చైనా వదులుతుంది. మిగిలిన 65-70% జలాలు భారత్‌లోనే మాన్సూన్ వర్షాల ద్వారా ఏర్పడతాయి అన్నారు.

కేంద్రం స్పందన

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ఈ అంశంపై చర్చలు జరిపారు. సరిహద్దు నదుల డేటాను పరస్పరం పంచుకోవాలని, నీటి భద్రతపై గట్టి ఒప్పందాలు అవసరమన్న అభిప్రాయాన్ని భారత ప్రభుత్వం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News