ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు పాకిస్తాన్, చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టింది. పాక్ తన కుట్రలను పక్కనపెట్టి.. ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలపై దృష్టి సారించాలని హితవు పలికింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాజాగా ఓ ఆఫ్రికన్ దేశానికి చెందిన అంశంపై చర్చించేందుకు పిలుపునిచ్చింది. మండలిలో చర్చించాల్సిన అంశాలతో పాటు.. కశ్మీర్ అంశాన్ని కూడా చేర్చాలని చైనా కోరింది. కానీ ఇతర సభ్యదేశాలు కాదనడంతో చైనాకు కూడా భంగపాటు తప్పలేదు. కశ్మీర్ అంశం భారత్, పాక్ ద్వైపాక్షిక అంశమని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది.