Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన లాయర్ అరెస్ట్
Shah Rukh Khan death threat case: బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Shah Rukh Khan death threat case
Shah Rukh Khan death threat case: బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని.. లేదంటే షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి బెదిరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా అతన్ని అరెస్ట్ చేశారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది మహ్మద్ ఫైజన్ ఖాన్‌గా గుర్తించారు.
షారుఖ్ తనకు రూ.50 లక్షల ఇవ్వకుంటే చంపేస్తానంటూ గత వారం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫైజాన్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో ఛత్తీస్‌గఢ్ వెళ్లిన పోలీసులు అక్కడ ఫైజన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
షారుఖ్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లోనూ ఇదే విధంగా బెదిరింపులు వచ్చాయి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా నటుడు సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటు సల్మాన్.. అటు షారుఖ్‌కు వరుస బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.