Lockdown: రేపటి నుంచే చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం

ఈ నెల 26 ఆదివారం నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభంకానుంది.

Update: 2020-04-25 15:42 GMT
Chardham temples

ఈ నెల 26 ఆదివారం నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభంకానుంది. కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు యాత్రను ప్రారంభిస్తారు. ఈ సారి ఎలాంటి సందడి లేకుండా నిరాడంబరంగానే దేవాలయాలు తెరుచుకోనున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ ఆలయాలు తెరుచుకోనున్నాయి.

లాక్ డౌన్ కావడంతో ప్రస్తుతం ఈ క్రమంలో చార్‌ధామ్ యాత్రక భక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్లు ప్రభుత్వం_ తెలిపింది. అయితే కేవలం కొద్ది మంది పూజారుల అనుమతి వుంటుందని, వారే ఆలయాల్లో పూజలు పునఃప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ 29న కేదార్‌నాథ్‌, వచ్చే నెల 15న బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకోబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags:    

Similar News