చార్‌ధామ్‌ యాత్ర షురూ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు

Char Dham Yatra 2022: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.

Update: 2022-05-03 14:16 GMT

చార్‌ధామ్‌ యాత్ర షురూ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు

Char Dham Yatra 2022: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఇవాళ తెరిచారు. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో గంగోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 11:15 నిమిషాలకు, యమునోత్రి ద్వారాలను మధ్యాహ్నం 12:15 నిమిషాలకు తెరిచారు. అనంతరం అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి సతీసమేతంగా గంగోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు చార్‌ధామ్‌ యాత్ర నిలిచిపోగా ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని అంచనా. అయితే గంగోత్రికి రోజుకు 7 వేల మంది, యమునోత్రికి రోజుకు 4 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఈ నెల 6న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని, 8న బద్రినాథ్‌ ఆలయాన్ని తెరవనున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయ దర్శనానికి రోజుకు 12వేలు మందిని, బద్రినాథ్‌కు 15 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News