శ్రామిక రైళ్ల స్టాపుల్లో కీలక మార్పులు
శ్రామిక్ రైళ్ళు నిలిపే ప్రదేశాల్లో పలు మార్పులు చేసింది రైల్వేశాఖ.
శ్రామిక్ రైళ్ళు నిలిపే ప్రదేశాల్లో పలు మార్పులు చేసింది రైల్వేశాఖ. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్ళు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శ్రామిక్ రైళ్లు నిలిపే ప్రాంతాల్లో అంటే రైలు బయలుదేరిన ప్రదేశం నుంచి గమ్యం చేరేవరకూ.. మూడు స్టాపుల్లో ఆపాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. దీంతో రైల్వే శాఖ ఈమార్పులు చేసింది. ప్రయాణికుల సంఖ్య కూడా 1200 నుంచి 1700లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు స్టాపుల్లో అనుమతి లేకుండా ఎవరికి ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది.
ఒక్కో శ్రామిక్ రైలులో 24 బోగీలు ఉండగా... ఒక్కోబోగీ సామర్థ్యం 72 సీట్లు. భౌతికదూరం నిబంధనల నేపథ్యంలో 54 మందిని ఒక్కో బోగికి అనుమతి ఇచ్చారు. తాజాగా మిడిల్ బెర్త్‌ను సైతం భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి దాకా 363 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకోగా.. మరో 105 రైళ్లు ఇంకా చేరుకోవాల్సి ఉంది. 15 నగరాలను అనుసంధానం చేస్తూ... ప్రారంభించే 15 సర్వీసులన్నీ రాజధాని ఎక్స్‌ప్రెస్ లానే ఉంటాయని వెల్లడించారు. ఛార్జీలు కూడా రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలోనే ఉంటాయని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 468 రైళ్లలో ఐదు లక్షల మంది వలస కూలీలను తరలించినట్టు రైల్వేశాఖ వెల్లడించింది.