నేడు జార్ఖండ్‌ అసెంబ్లీలో చంపై సోరెన్‌ బలపరీక్ష

Jharkhand: బలపరీక్షలో పాల్గొననున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యేలు

Update: 2024-02-05 03:23 GMT

నేడు జార్ఖండ్‌ అసెంబ్లీలో చంపై సోరెన్‌ బలపరీక్ష

Jharkhand: ముఖ్యమంత్రి పదవికి హేమంత్‌ సొరేన్‌ రాజీనామా తర్వాత జార్ఖండ్‌లో జేఎంఎం నేత చంపై సొరేన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నది. బలపరీక్ష నెగ్గడం అధికార కూటమికి అంత సులువుగా కనిపించడం లేదు.

81 స్థానాలు ఉండే జార్ఖండ్‌ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 41 కంటే ఎక్కువగానే తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, ఆ సంఖ్య 46-47 వరకు చేరుకొంటుందని సీఎం చంపైసొరేన్‌తో సహా అధికార పక్ష నేతలు ధీమాగా ఉన్నారు. అయితే కూటమిలోని ఎమ్మెల్యేలు అందరూ బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే సరే.. లేకుంటే సర్కార్‌ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News