COVID 19 Vaccination: మే1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా

COVID 19 Vaccination: దేశాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్రం మూడో దశ యుద్ధం ప్రకటించింది.

Update: 2021-04-19 15:35 GMT

COVID 19 Vaccination: మే1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా

COVID 19 Vaccination: దేశాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్రం మూడో దశ యుద్ధం ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో కరోనా వారియర్స్‌కు, 60 ఏళ్ళు పైబడినవారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో దశలో 45 ఏళ్ళు దాటిన వారికి ఇస్తున్నారు. ఇక మూడో దశలో వయోజనులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఉన్నప్పటికీ త్వరలోనే ఆ సమస్యను అధిగమించనున్నట్లు కేంద్రం భావిస్తోంది. ప్రజలను రక్షించడానికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ఒక్కటే మార్గమని కేంద్రం అనుకుంటోంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణయం తీసుకుంది. ఈ రోజంతా కరోనాకు సంబంధించిన భేటీలతోనే ప్రధాని మోడీ బిజీగా ఉన్నారు. కరోనా కట్టడి చేయడం, రోగులకు వైద్య సహాయం, ఇతరత్రా ఎదుర్కొంటున్న సవాళ్ళు, సమస్యలపై వైద్య రంగ నిపుణలతో ప్రధాని చర్చిస్తున్నారు.

Tags:    

Similar News