Covid Vaccine: జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం మార్గదర్శకాలు విడుదల
Covid19 Vaccination: జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Covid Vaccination: జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం మార్గదర్శకాలు విడుదల
Covid19 Vaccination: జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు టీకాలు కేటాయింపు ఇవ్వనున్నారు. కరోనా తీవ్రత ఎక్కువున్న రాష్ట్రాలకు టీకాల కేటాయింపులో మొదటి ప్రాధాన్యాత ఇవ్వనున్నారు.
టీకాలు వృథా చేసే రాష్ట్రాలకు కేటాయింపులో కోత విధించనున్నారు. వ్యాక్సినేషన్ సక్రమంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సహాకాలు, ప్రాధాన్యతను పెంచనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొంది. టీకాల లభ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించాలని కేంద్రం తెలిపింది.