బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం సిద్ధం..!

* 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ..? * లిస్ట్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్ బ్యాంక్..

Update: 2021-02-16 02:48 GMT

Representational Image

కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను చేరుకునేందుకు వీలుగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం.

 బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను ప్రైవేటీకరణకు ఎంపిక చేసినట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదట 2 బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేయనున్నారని తెలుస్తోంది. అయితే ముందుగా చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించాక.. స్పందన ఆధారంగా మరిన్ని బ్యాంకుల్ని కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News