దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై సీబీఐ దాడులు

CBI Raids: 40 చోట్ల దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు

Update: 2022-05-12 02:55 GMT

దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై సీబీఐ దాడులు

CBI Raids: దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది సీబీఐ ఒకేసారి 40 చోట్ల దాడులు నిర్వహించాయి సీబీఐ అధికారుల బృందాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో సోదాలు జరిగాయి. 14 మంది ఎన్జీవోలకు సంబంధించిన వారిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తుండగా ఆరుగురు ప్రభుత్వం ఉద్యోగులను కూడా సీబీఐ అరెస్ట్‌ చేసినట్టు చెబుతున్నారు.

స్వచ్ఛంద సంస్థల ముసుగులో పెద్దఎత్తున డబ్బులను రాబడుతోన్న వ్యవహారాలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా జరిగిన సోదాల్లో రూ.3 కోట్ల పైచిలుకు నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ చెందిన మనోజ్ కుమార్ ని కూడా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఫెరా నిబంధనలను ఉల్లంఘించి హవాలా ద్వారా స్వచ్ఛంద సంస్థలు ఆపరేటింగ్‌ చేస్తున్నట్టు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.

Tags:    

Similar News