కీలక మలుపు తిరిగిన ఎక్సైజ్ పాలసీ కేసు.. ఢిల్లీ డిప్యూటీ సీఎంకు సీబీఐ లుక్ అవుట్ నోటీసులు

Manish Sisodia: ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది.

Update: 2022-08-21 08:08 GMT

కీలక మలుపు తిరిగిన ఎక్సైజ్ పాలసీ కేసు.. ఢిల్లీ డిప్యూటీ సీఎంకు సీబీఐ లుక్ అవుట్ నోటీసులు

Manish Sisodia: ఎక్సైజ్ పాలసీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాకు సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని లుకవుట్ నోటీసుల్లో పేర్కొన్నారు. మనిష్ సిసోడియాతో పాటు మరో 14 మందికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే సీబీఐ లుక్ అవుట్ నోటీసులపై స్పందించిన సిసోడియా తనను సీబీఐ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ స్కాంపై కేంద్రం, కేజ్రీవాల్ సర్కార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో అవకతవకల గురించి తన నేతపై కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉంటారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఠాగూర్ అన్నారు. అయితే ఠాగూర్ వ్యాఖ్యలను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియా ఖ‌ండించారు. బీజేపీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సోసిడియా తేల్చిచెప్పారు. 

Tags:    

Similar News