విషాదంగా మారిన ఉర్స్ వేడుక.. జనంలోకి దూసుకెళ్లిన ఎద్దు..

Maharashtra: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఉర్సు వేడుక విషాదంగా మారింది.

Update: 2023-02-09 13:00 GMT

విషాదంగా మారిన ఉర్స్ వేడుక.. జనంలోకి దూసుకెళ్లిన ఎద్దు..

Maharashtra: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఉర్సు వేడుక విషాదంగా మారింది. ఉర్సు సంబరాలు జరుపుకుంటున్న జనం గుంపులోకి భారీ ఆకారంతో ఉన్న ఎద్దు పరుగులు తీసింది. ఉర్సు ఉత్సవాల సందర్భంగా వేలాది మంది జనం గ్రౌండ్‌కు తరలిరావడంతో..వారిపైకి ఎద్దు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎద్దు జనంమీదకు దూసుకురావడంతో హాహాకారాలు చేస్తూ..పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో దాదాపు 14 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే వారిని చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఎద్దు జనంమీదకు రావడంతో ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags:    

Similar News