BSF Soldier: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌

BSF Soldier: పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు (IB) దాటి పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ (BSF Soldier) పూర్ణమ్ కుమార్ షాను పాకిస్థాన్ అధికారులు ఎట్టకేలకు భారత్‌కు అప్పగించారు.

Update: 2025-05-14 07:00 GMT

BSF Soldier: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాక్‌

BSF Soldier: పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు (IB) దాటి పాకిస్థాన్‌ భూభాగంలోకి ప్రవేశించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ (BSF Soldier) పూర్ణమ్ కుమార్ షాను పాకిస్థాన్ అధికారులు ఎట్టకేలకు భారత్‌కు అప్పగించారు. అట్టారి చెక్‌పోస్ట్ వద్ద ఈ మార్పిడి జరిగింది.

ఏం జరిగింది?

గత ఏప్రిల్ 23న మధ్యాహ్నం సమయంలో, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ వద్ద విధులు నిర్వహిస్తున్న 182 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌కు చెందిన పూర్ణమ్ కుమార్ షా, కొంతమంది రైతులతో కలిసి ఉన్న సందర్భంలో పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లారు. వెంటనే పాక్‌ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

జవాన్‌ విడుదలకు భారత ప్రయత్నాలు

జవాన్‌ ఆచూకీ తెలిసిన నాటి నుంచి, భారత బీఎస్‌ఎఫ్‌, ఆర్మీ అధికారులు పాకిస్థాన్‌ రేంజర్లతో ఫ్లాగ్ మీటింగ్‌లు నిర్వహిస్తూ, విడుదల కోసం సంప్రదింపులు కొనసాగించారు. అయితే పాకిస్థాన్‌ రేంజర్లు తొలుత జవాన్‌ను అప్పగించేందుకు నిరాకరించడం, అతడి సమాచారం చెప్పకపోవడం వల్ల జవాను కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఎట్టకేలకు భారత్‌కు అప్పగింపు

పట్టుబడిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను మే 14న అట్టారి చెక్‌పోస్ట్ వద్ద పాక్‌ రేంజర్లు భారత అధికారులకు అప్పగించారు. ఈ ఘటనతో జవాన్‌ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం పూర్ణమ్ కుమార్ షాను విచారణ నిమిత్తం బీఎస్‌ఎఫ్‌ అధికారుల వద్దకు తరలించారు.

Tags:    

Similar News