Kangana Ranaut: కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బ
Kangana Ranaut: 19వ తేదీకి విచారణను వాయిదా వేసిన బాంబే హైకోర్టు
Kangana Ranaut: కంగనా రనౌత్ కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బ
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ నటించి.. స్వీయ దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆదేశించలేమని బాంబే హైకోర్టు వెల్లడించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్దంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని బీపీ కొలబవాలా, ఫిర్దౌస్ పూనావాలతో కూడిన బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ చిత్ర సహా నిర్మాత జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది బాంబే కోర్టు.