ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలా: చైనా

Delhi: భారతదేశ వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తోన్న వార్తలపై డ్రాగన్‌ స్పందించింది

Update: 2021-03-04 02:02 GMT

ఫైల్ ఇమేజ్


Delhi:భారత పోర్టులపైనా చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారంటూ రికార్డెడ్ ఫ్యూచర్‌ చేసిన ఆరోపణలను డ్రాగన్ దేశం ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరిపై నిందలు వేయడం బాధ్యతారాహిత్యం, దుర్మార్గమని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. చైనాకు చెందిన ఏపీటీ10 అనే హ్యాకింగ్‌ గ్రూపు భారత్‌లోని కొన్ని ఫార్మా సంస్థల ఐటీ వ్యవస్థల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని సింగపూర్‌, టోక్యోలకు చెందిన సైఫర్మా అనే సంస్థ హెచ్చరించింది. సర్వర్లు బలహీనంగా ఉన్న విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించి తగిన చర్యలు చేపట్టాయి. భారతదేశ వ్యవస్థను అస్థిరపరచటమే కాదు, మేధో హక్కులను (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ) సొంతం చేసుకోవటానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. మన సాంకేతిక వ్యవస్థల్లోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నారు. చైనాకు చెందిన 'రెడ్‌ఎకో' అనే థ్రెట్‌ యాక్టర్‌ హ్యాకింగ్‌ గ్రూపు మనదేశంలోని రాష్ట్ర, ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్లను లక్ష్యంగా చేసుకుందని గత ఏడాది నవంబరులో హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News