గుజరాత్ లో అంతుచిక్కని వ్యాధి.. తొమ్మిది మంది మృతి!

కరోనా వ్యాధితోనే ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అంతుచిక్కని వ్యాధులు జనాలను మరింతగా భయపెడుతున్నాయి. ఈ మధ్య ఏపీలోని ఏలూరులోని ప్రజలు నిలబడిన చోటే పడిపోయారు. ఇప్పటికి ఈ సమస్యకి కారణం ఏంటో తెలియదు

Update: 2020-12-18 09:54 GMT

కరోనా వ్యాధితోనే ప్రజలు నానా అవస్థలు పడుతుంటే అంతుచిక్కని వ్యాధులు జనాలను మరింతగా భయపెడుతున్నాయి. ఈ మధ్య ఏపీలోని ఏలూరులోని ప్రజలు నిలబడిన చోటే పడిపోయారు. ఇప్పటికి ఈ సమస్యకి కారణం ఏంటో తెలియదు. ఇదిలా ఉంటే ఇప్పుడు గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. మ్యూకోర్మైకోసిస్‌ అనే అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా అహ్మదాబాద్‌లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముప్పై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేవలం గుజరాత్ లోనే కాకుండా ముంబై, ఢిల్లీలో కూడా ఈ వ్యాధి కేసులు వస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు ఈ వ్యాధికి గురైనవారంతా 50ఏళ్ల పైబడినవారే కావడం గమనార్హం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కరోనా నుంచి కోలుకున్న వారిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఇక ఈ వ్యాధి సోకితే శరీరంలో మొదడుతో పాటు పలు అవయవాలు పనిచేయకుండా పోతాయని వైద్యులు అంటున్నారు. 

Tags:    

Similar News