BJP Meeting: నేటి నుంచి రెండ్రోజుల పాటు బీజేపీ సమావేశాలు..
BJP Meeting: లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలుపుపై సమాలోచనలు
BJP Meeting: నేటి నుంచి రెండ్రోజుల పాటు బీజేపీ సమావేశాలు..
BJP Meeting: నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల సమాయత్తమే సమగ్ర అజెండాగా జాతీయ నాయకత్వం ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల నుంచి 11వేల 500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గంతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ కార్యవర్గ సభ్యులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.
కాసేపట్లో బీజేపీ పదాధికారులతో సమావేశం ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 3 గంటలకు విస్తృతస్థాయి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలుపుపై సమాలోచనలు చేయనుంది జాతీయ నాయకత్వం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనుండగా.. ప్రధాని మోడీ ఉపన్యాసంతో సమావేశాలు సమాప్తం అవనున్నాయి.