Election 2023: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?
BJP: అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది.
Election 2023: ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. తెలంగాణ అభ్యర్థుల జాబితా ఎప్పుడంటే?
BJP: అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది బీజేపీ. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో 21 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, మధ్యప్రదేశ్‌లో 39 స్థానాల్లో క్యాండిడేట్స్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. నిన్న జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు.
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. సెప్టెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనుంది. వచ్చే నెలలో జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.